రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు.. ఏపీ నుంచి పోటీ చేస్తానంటూ.

-

కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ తెలిపారు. ఇవాళ విజయవాడలో పర్యటించిన రేణుక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని రేణుకా చౌదరి మండిపడ్డారు. రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు.  అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తుంటే.. సీఎం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఏపీకి రావాలని ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని, పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు నిర్ణయం తీసుకుంటానని రేణుకా చౌదరి చెప్పారు. తాను రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతానని. ఎవరు ఆపుతారో చూస్తానని హెచ్చరించారు. ఏమైనా అంటే కులాలను అడ్డంపెట్టుకుని మాట్లాడుతున్నారని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కుటుంబమని, భేదాభిప్రాయాలు ఉంటాయే తప్ప ఇతర పార్టీల్లో మాదిరి కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version