కొడాలి ప్లేస్‌ని రీప్లేస్ చేసే ‘కమ్మ’ మంత్రి ఎవరు?

-

కొడాలి నాని….మరో డౌట్ లేకుండా అధికార వైసీపీలో ఉన్న సూపర్ ఫైర్ బ్రాండ్ నాయకుడు అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే జగన్ మీద ఈగ వాలనివ్వకుండా, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఒంటికాలి మీద వెళ్ళే నాయకుడు. చంద్రబాబు…నిత్యం జగన్‌పై ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆ విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్లు వస్తాయి. కానీ కొడాలి నాని వచ్చి, బాబుకు కౌంటర్లు ఇచ్చేవరకు వైసీపీ శ్రేణులు ప్రశాంతంగా ఉండరనే చెప్పొచ్చు. అయినా బాబు లాంటి వారికి కౌంటర్లు ఇవ్వాలంటే కొడాలి లాంటి వాళ్లే కరెక్ట్ అని వైసీపీ శ్రేణులు భావిస్తాయి.

ఒకవేళ కొడాలి లాంటి వాళ్ళు లేకపోతే ఈ పాటికే చంద్రబాబు తన రాజకీయంతో జగన్‌ని నెగిటివ్ చేసేవారని చెప్పొచ్చు. కొడాలి లాంటి మంత్రి ఉండటంతోనే జగన్‌కు పెద్ద ఇబ్బంది రావడం లేదనే చెప్పొచ్చు. మరి అంతలా జగన్ ప్రభుత్వంపై ఈగ వాలనివ్వకుండా చూసుకుంటున్న కొడాలి నాని, త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో సైడ్ అయితే, ఆయన ప్లేస్‌లో వచ్చే కమ్మ మంత్రి ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

ఓ రకంగా చెప్పాలంటే కొడాలి ప్లేస్‌ని ఎవరూ రీప్లేస్ చేయలేరని చెప్పొచ్చు. కాబట్టి కొడాలి మంత్రివర్గంలో కొనసాగితే బెటర్ అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ జగన్ 100 శాతం మంత్రివర్గంలో మార్పులు ఖాయమని చెప్పేశారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పేశారు. కాబట్టి కొడాలి సైడ్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది.

మరి ఆయన ప్లేస్‌లో ఎవరు వస్తారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వైసీపీలో నాని మినహా కమ్మ ఎమ్మెల్యేలు ఐదుగురు ఉన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్ రావు, అన్నాబత్తుని శివకుమార్, వసంత కృష్ణప్రసాద్, అబ్బయ్య చౌదరీల్లో ఒకరికి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే మర్రి రాజశేఖర్ ఉన్నారు. కానీ మండలి రద్దు నేపథ్యంలో అది సాధ్యం కాకపోవచ్చు. మరి కొడాలి ప్లేస్‌లో జగన్ క్యాబినెట్‌లోకి ఎవరు వస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version