పాదయాత్రలో బండికి రిక్వెస్టులు..అక్కడే పోటీ చేస్తారా?

-

తెలంగాణలో బండి సంజయ్ దూకుడు ఓ రేంజ్‌లో కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పై పోరాడుతూనే, బీజేపీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. అటు వరుసపెట్టి పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో బండి పాదయాత్ర ఐదో విడత కొనసాగుతుంది. ఇక బండి పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.

అదే సమయంలో నిర్మల్‌లో పాదయాత్ర చేస్తున్న బండికి సరికొత్త రిక్వెస్టులు కూడా వస్తున్నాయి. తాజాగా ఆయన ముధోల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో అక్కడ బీజేపీ నేతలు, కార్యకర్తల నుంచి బండికి కొన్ని రిక్వెస్టులు వచ్చాయట. అవి ఏంటంటే..ముధోల్‌లో బండి పోటీ చేయాలని అక్కడ నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు. ఇక్కడ బీజేపీకి బలం ఉందని, పైగా ముస్లిం వర్గం కూడా సహకరిస్తుందని, కాబట్టి బండి ఇక్కడ పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలుస్తారని అక్కడ నాయకులు భావిస్తున్నారు. అదే విషయాన్ని బండితో కూడా చెప్పారట.

కానీ దీనిపై బండి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ముధోల్‌లో ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి విఠల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో ఈయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. 2018లో టీఆర్ఎస్ నుంచి గెలిచారు. అయితే రెండు ఎన్నికల్లో బీజేపీ సెకండ్ ప్లేస్‌లోనే నిలిచింది. పైగా ఇక్కడ కాంగ్రెస్‌ బలం తగ్గుతుంది. అటు బీజెపీలో కూడా బలమైన నాయకులు కనిపించడం లేదు.

విఠల్ రెడ్డిపై వ్యతిరేకత ఉన్నా సరే సరిగ్గా వాడుకుని బలపడటంతో విఫలమవుతున్నారు. అందుకే డైరక్ట్ గా ఇక్కడ బండి పోటీ చేయాలని కోరుతున్నారు. పైగా బండి సామాజికవర్గమైన మున్నూరు కాపు ఓట్లు ఇక్కడ యాభై వేల వరకు ఉన్నాయి..కాబట్టి బండి పోటీ చేస్తే ఈజీగా గెలుస్తారని భావిస్తున్నారు. కానీ బండి మాత్రం కరీంనగర్ అసెంబ్లీ లేదా వేములవాడపైనే ఫోకస్ చేశారు. మరి చూడాలి ముధోల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version