ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ సీపీ ఫైర్ బ్రాండ్ అంటే వెంటనే గుర్తు వచ్చేది ఎమ్మెల్యే రోజా. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు వేస్తు.. వైసీపీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సినిమాలలో హీరోయిన్ గా చేస్తూ.. రాజకీయాల్లోకి వచ్చిన రోజా.. నగరి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచింది. కాగ ఈ ఫైర్ బ్రాండ్ రోజా తాజా గా సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
కాగ శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ నియామకంపై ఎమ్మెల్యే రోజా తీవ్ర మనస్తాపం చెందినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల శ్రీ శైలం బోర్డు చైర్మెన్ గా చెంగా రెడ్డి చక్రపాణి రెడ్డిని నియమిస్తు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎమ్మెల్యే రోజా అసంతృప్తికి గురి అయింది. కాగ ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా, చెంగా రెడ్డి చక్రపాణిరెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది.
అయితే ఇప్పుడు చెంగా రెడ్డి చక్రపాణి రెడ్డికి శ్రీశైలం బోర్డు చైర్మెన్ గా నియమకం కావడంతో ఎమ్మెల్యే రోజా అసంతృప్తి చెందింది. ఈ వ్యవహారాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మెల్యే రోజా తెలిపారు. అంతే కాకుండా ఈ వ్యవహారంలో అవసరం అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రోజా ప్రకటించింది.