బండి సంజయ్ కి షాక్.. రేపటి నిరుద్యోగ దీక్ష కు నో పర్మిషన్

-

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. బిజెపి పార్టీ రేపు తల పెట్టబోయే నిరుద్యోగ దీక్షపై కరోనా మహమ్మారి ఆంక్షలు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశాల ప్రకారం నిన్న కరోనా ఆంక్షలపై ఉత్తర్వులు జారీ చేసింది కెసిఆర్ ప్రభుత్వం.
జనవరి 2 వరకు తెలంగాణ రాష్ట్రం లో బహిరంగ సభలు , ర్యాలీ లు నిషేధం అంటూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.

ఈ నేపథ్యం లో నిరుద్యోగ దీక్ష నిర్వహణ కు పోలీసుల అనుమతి కచ్చితం కావడం తో.. బీజేపీ పార్టీ దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభ లు నిషేధం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బీజేపీ దీక్ష కి అనుమతి నిరాకరించారు తెలంగాణ పోలీసులు. ప్రభుత్వ నియమాల ప్రకారం అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు పోలీసులు. దీంతో బిజెపి పార్టీ రేపు తల పెట్టబోయే నిరుద్యోగ దీక్షపై తీవ్ర సందగ్దత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version