ఏపీలో థియేటర్లు మూత పడటం బాధాకరం… తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు- హీరో నిఖిల్

-

టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల వార్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు థియేటర్లు మూతపడ్డాయి. ప్రభుత్వం తీసుకువచ్చిన టికెట్ ధరలు తమ మెయింటనెన్స్ సరిపోవని సినిమా థియేటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే… తెలంగాణ ప్రభుత్వం మాత్రం టాలీవుడ్ కు తీపి కబురు చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి.. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ’ఐలవ్ మై గవర్నమెంట్‘ అంటూ ట్విట్టర్ లో థాంక్స్ చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా యంగ్ హీరో నిఖిల్ ఏపీలో థియేటర్ల మూసివేత, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపారు.

నిఖిల్ ట్విట్టర్ లో థియేటర్లు నాకు దేవాలయం లాంటిదని.. ప్రజలకు ఆనందాన్ని ఇస్తాయని.. థియేటర్లు మూత పడటం బాధాకరం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మద్దతు ఇవ్వడం సంతోషకరం అని.. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో థియేటర్లకు తిరిగి వైభవం రావడానికి ఏపీ ప్రభుత్వం సహాయపడుతుందని ఆశిస్తున్నా అన్నారు. ప్రతీ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ.20 టికెట్ సెక్షన్ ఉందని.. థియేటర్లు ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫ్లెక్సిబుల్ టికెట్ రేట్లను బాల్కనీ/ ప్రీమియం విభాగంలో అనుమతించాలని అధికారులకు అభ్యర్థన అంటూ వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version