Breaking తెలంగాణలోనూ క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు !

-

ఒమి క్రాన్ కట్టడిపై ఇవాళ తెలంగాణ హై కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సనగతి తెలిసిందే. న్యూఇయర్, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ సర్కార్ ను ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలపై మంత్రి హరీష్ రావు స్పందించారు. హై కోర్ట్ ఆదేశాలను గౌరవిస్తామని.. ఇంకా కోర్ట్ ఆర్డర్ కాపీ అందలేదన్నారు. ఆర్డర్ కాపి అందిన తరువాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఒమిక్రాన్ పై కట్టడి చర్యలు తీసుకుంటున్నామని.. ఎయిర్ పోర్ట్ లో విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ టెస్ట్ చేస్తామని వెల్లడించారు. కేంద్రం బూస్టర్ డోస్ , చిన్న పిల్లల వాక్సినేషన్ పై స్పందించడం లేదని.. ఇతర దేశాలు బూస్టర్ ఇవ్వాలని చెబుతున్న కేంద్రం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటికే అడిగినా ఎలాంటి స్పందన లేదని.. ఈ నెల ఆఖరు లో ఢిల్లీ లో ఆర్థిక శాఖ మంత్రులతోకేంద్రం నిర్వహించనున్న సమావేశానికి వెళ్లే అవకాశం వుందని చెప్పారు. అయితే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను బట్టి చూస్తే.. తెలంగాణలోనూ న్యూఇయర్, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version