హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సీఎం రేవంత్ కన్ను పడిందని.. అందుకు ఓ బీజేపీ ఎంపీ సహకారం మెండుగా ఉందని.. వీరిద్దరు కలిసి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీతో కుమ్మక్కై HCU భూములను అమ్మాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
శుక్రవారం తెలంగాణ భవన్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒక బీజేపీ ఎంపీ,ఒక బ్రోకరేజ్ కంపెనీ సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి కంచ గచ్చిబౌలి భూముల విషయంలో భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపించారు.ఆ భూముల మీద టీజీఐఐసీకి ఎటువంటి ఓనర్‌షిప్ రైట్స్ లేకున్నా ఆ భూములను తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.