గడియారాల్లో 10:10 సమయం వెనుక అసలైన కారణాలు ఇవే..!

-

సమయం ఎంతో విలువైనది అని అందరికి తెలిసిందే. ప్రతి ఒక్కరూ వారి పనులను పూర్తి చెయ్యడానికి ఎంతో సమయపాలన ఉండే విధంగా చూసుకుంటారు. టైం ను చూడడానికి గడియారాన్ని లేక వాచ్ ను ఉపయోగించడం సహజమే. పైగా ఇది అందరి జీవితాలలో కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే సమయాన్ని చూడకుండా ఏ పనిని ఎవరు మొదలు పెట్టరు. అయితే గడియారాన్ని కనుగొన్న సమయంలో సమయాన్ని ఎలా మ్యాచ్ చేశాడు అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. జర్మనీకు సంబంధించిన పీటర్ హెన్లీన్ మొదటిగా యాంత్రిక గడియారాన్ని కనుగొనడం జరిగింది. ఆ తర్వాత గడియారాలకు సంబంధించిన చరిత్ర ప్రారంభం అయింది అని చెబుతూ ఉంటారు.

అంతేకాకుండా గడియారానికి సంబంధించిన మరొక ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఎప్పుడైతే గడియారాన్ని కొనుగోలు చేయడానికి దుకాణానికి వెళ్తారో అక్కడ ఉండేటువంటి గడియారాలు అన్ని 10:10 అని చూపిస్తాయి. అయితే దాని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అబ్రహం లింకన్ పై కాల్పులు జరిపిన సమయం 10:10 అని ఆయన మరణించడంతో ఇలా ఏర్పాటు చేస్తారని కొంతమంది భావిస్తారు. కాకపోతే నిజానికి అబ్రహం లింకన్ చనిపోయిన సమయం ఉదయం 7 గంటలు అని మరికొందరు చెబుతారు.

అంతేకాకుండా జపాన్ లో రెండో ప్రపంచ యుద్ధంకు సంబంధించి హిరోషిమా నాగసాకి ప్రదేశాలపై అనుబాంబు వేసిన సమయం కూడా ఇదే అని, అందువలన గడియారంలో 10:10 ఉంటుంది అని అంటారు. అయితే గడియారంలో ఈ సమయం ఉండడానికి ఈ కారణం కూడా ఒకటి. 10:10 సమయం ఉన్నప్పుడు వి ఆకారం వస్తుంది. వి అంటే విక్టరీ అని అంటారు. అంతేకాకుండా వి ఆకారంలో ఉన్నప్పుడు గడియారం కు సంబంధించిన బ్రాండ్ కూడా ఎంతో బాగా కనిపిస్తుంది అని, అందుకే ఈ సమయాన్ని పాటిస్తారు అని కొందరు భావిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news