సీఎం కేసీఆర్ కి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ

-

తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని గతంలో కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ లేఖ రాసింది వాస్తవం కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆ లేఖను అడ్డుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మెలిక పెడుతున్న సంగతి నిజం కాదా అని నిలదీశారు.

తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్ళు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని కేసీఆర్ ను నిలదీసారు. మీరే లేఖ ఇచ్చి..  ఇప్పుడు మీరే ధర్నాలు.. నిరసనలు అని డ్రామాలు ఆడితే టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీలో మోసాన్ని పెడతారని ఫైర్ అయ్యారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బ్లేమ్ గేమ్ తో… ఇప్పటికే రైతులు… దళారుల చేతుల్లో నష్టపోతున్న సంగతి నిజం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతులు నిస్సహాయ స్థితిలో రైస్ మిల్లర్లకు 1400 కే ధాన్యం అమ్ముకుంటున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు ఢిల్లీలో ధర్నాలు చేస్తూ తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version