రేవంత్ కొత్త స్కెచ్: ప్రవీణ్ కూడా కలిసొస్తారా?

-

ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి కాస్త అదృష్టం తక్కువగానే ఉందని చెప్పాలి…ఎందుకంటే తెలంగాణలో బాగా బలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు..తన ఉనికి కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. 2014 ముందువరకు ఒక వెలుగు వెలిగిన పార్టీ…ఆ తర్వాత నుంచి దారుణమైన పరిస్తితులని ఎదురుకుంటుంది. ఒక వైపు కేసీఆర్ వల్ల కాంగ్రెస్‌కు ఎక్కువ డ్యామేజ్ జరగగా, మరోవైపు సొంత తప్పిదాల వల్ల కూడా డ్యామేజ్ జరిగింది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఇన్ని రకాలుగా డ్యామేజ్ జరిగినా సరే రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యాక పార్టీ కాస్త గాడిలో పడింది. బలమైన క్యాడర్ ఉండటం వల్ల ఆ పార్టీకి పికప్ అవ్వడానికి అవకాశం దొరికింది. పైగా టీఆర్ఎస్‌పై రోజురోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరిగితే కాంగ్రెస్‌కు కలిసిరావాలి. కానీ దురదృష్టం కొద్ది బీజేపీకి ప్లస్ అవుతుంది. అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ పరిస్తితి మళ్ళీ రివర్స్ అయ్యేలా ఉంది. అసలు తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్యే వార్ జరుగుతున్నట్లు రాజకీయం మారింది.

అంటే మళ్ళీ కాంగ్రెస్ పరిస్తితి ఇబ్బందుల్లో పడింది. ఇలా ఇబ్బందుల్లో పడ్డ కాంగ్రెస్‌ని ఎలాగైనా పైకి లేపేందుకు రేవంత్..తన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీని ఆ రెండు పార్టీలకు ధీటుగా తీసుకురావడానికి సరికొత్త స్కెచ్‌లతో ముందుకెళుతున్నారు. అందుకే తెలంగాణలో చిన్నాచితక పార్టీలని కలుపుకుని ముందుకెళ్లాలని రేవంత్ చూస్తున్నారు. కమ్యూనిస్టుల సపోర్ట్‌తో ఇతర చిన్న పార్టీల మద్ధతు కూడగట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు ప్రొఫెసర్ కోదండరాం మద్ధతు కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఇక తెలంగాణలో బి‌ఎస్‌పికు కూడా కాస్త పట్టు ఉంది. ఆ పార్టీకి ఓ 10 నియోజకవర్గాల్లో మంచి బలం ఉంది. పైగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారు చేరాక కాస్త బి‌ఎస్‌పి బలం పెరిగింది. అందుకే బి‌ఎస్‌పి మద్ధతు కూడా తీసుకుని ముందుకెళ్లాలని రేవంత్ చూస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్‌కు పట్టు దొరుకుతుందని భావిస్తున్నారు. చూడాలి మరి రేవంత్ స్కెచ్‌లు వర్కౌట్ అవుతాయో లేదో?

Read more RELATED
Recommended to you

Exit mobile version