రాజలింగమూర్తి హత్యపై రేవంత్ రెడ్డి ఆరా..సీఐడీ విచారణకు ఆదేశం?

-

భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి దారుణ హత్యపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, రాజలింగమూర్తి హత్యకు బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి కారణమని తొలుత ఆరోపణలు రాగా.. భూ వివాదాల నేపథ్యంలో ఆయన హత్య జరిగిందని పోలీసులు నిర్దారించారు. ఈ మేరకు హత్యకేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిపై మృతురాలి భార్య ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. హత్య కేసులో నిందితులైన రేణుకుంట్ల సంజీవ్, పింగళి శ్రీమంత్, మోరే కుమార్, కొత్తూరి కుమార్, రేణుకుంట్ల కొమురయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉండగా, మేడిగడ్డ బ్యారేజీలో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు మీద రాజలింగమూర్తి కేసు వేయడం వల్లే ఆయన మర్డర్ జరిగిందని తొలుత ఆరోపణలు వినిపించాయి.

Read more RELATED
Recommended to you

Latest news