ఆన్లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్స్, బెట్టింగ్ యాప్స్ మోసాల మీద ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ మరోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సీరియస్ అయ్యారు. ఏపీలోని యూట్యూబర్, ఫిషర్ మ్యాన్ నాని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంపై సజ్జన్నార్ గురవారం తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
‘మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి.ఇవేం దిక్కుమాలినపనులు.మీ టాలెంట్ ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోవడంలో తప్పులేదు.అలా చేస్తే మిమ్మల్ని సమాజం హర్షిస్తోంది. ఇలాంటి పనుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం ఎంత వరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లమని, మేం ఏం చేసిన నడుస్తుందనే భ్రమలో ఉండకండి. చట్టప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లను ఆపండి’ అంటూ మండిపడ్డారు.
https://twitter.com/SajjanarVC/status/1892430468689113561