కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలి : రేవంత్‌

-

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ఆది నుంచే సమస్యలకు నెలవైంది. ఎప్పటికప్పడు అధికారులు ధరణి పోర్టల్‌ను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ వ్యవస్థతో ప్రజలుకు మేలు చేకూర్చుతారని అంతా భావిస్తుంటే ధరణిలో తలెత్తుతున్న సమస్యలు తెలంగాణ సర్కార్‌కు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యలతో బాధపడుతున్న రైతుల ఆవేదనను ట్విట్టర్‌ వేదిక పంచుకున్నారు.

అధికారుల పరీక్షల నిర్వహణ వైఫల్యంతోనే తన కుమారుడు బలవన్మరణం చెందాడని తల్లిదండ్రులు గుండెలు బాధుకుంటున్నారు. తాజాగా.. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘మట్టిలో మాణిక్యం లాంటి గూగులోతు రాజ్ కుమార్ ఆత్మహత్య పాపం ఎవరిది? ఉపాధి లేదు.. ఉద్యోగం రాదు.. పోటీ పరీక్ష రాస్తే ప్రశ్నాపత్రం లీకేజీలు. తెలంగాణలో లక్షలాది మందికి ఉద్యోగాలిస్తున్నాం అని ఊకదంపుడు ప్రకటనలు చేసే కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలి.’’ అని రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version