మీసమున్న మగాళ్లు అయితే నా సవాల్ ను స్వీకరించాలి : రేవంత్‌ రెడ్డి

-

” రాష్ట్రంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ది. అందుకే నేను కేసీఆర్ కు సవాల్ విసిరా. ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టామో అక్కడే మేం ఓట్లు అడుగుతాం. ఎక్కడ మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టారో అక్కడే మీరు ఓట్లు అడగండి. సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డికి సవాల్ విసురుతున్నా. మీ ఒంట్లో చీము, నెత్తురు ఉంటే… మీసమున్న మగాళ్లు అయితే నా సవాల్ ను స్వీకరించాలి. ఈ సవాల్ ను స్వీకరిస్తే ఏ నియోజకవర్గంలోనూ మీకు డిపాజిట్లు రావు. అయినా మీకు డిపాజిట్లు వస్తే మేం గుండు కొట్టించుకుంటాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ సవాల్ ను స్వీకరిస్తే ఏ నియోజకవర్గంలో మీకు డిపాజిట్లు రావని ఆయన అన్నారు. అయినా మీకు డిపాజిట్లు వస్తే మేం గుండు కొట్టించుకుంటామని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని అన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామని, రూ. 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామన్న ఆయన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తామన్న రేవంత్ రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version