తెలంగాణలో నక్సలిజం ఉన్నా బాగుండేదనే పరిస్థితికి తీసుకువచ్చారు. .. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెచ్చుకున్న తెలంగాణను ఏపరిస్థితికి తీసుకువచ్చారు… నక్సలైట్లు ఉంటే అభివ్రుద్దికి ఆటంకం అని అనుకునే వాళ్లం అని..  బరి తెగించి ఆంబోతుల్లాగా ప్రవర్తిస్తున్నారని.. వారి బలుపు అనిచేందుకు నక్సలిజం ఉన్నా బాగుండేదని యువకులు అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని అన్నారు. నిరసన తెలుపుతున్న వారిపై చేస్తున్న దాడులను ఖండిస్తున్నామని అన్నారు. రేపటి నుంచి రోడ్ల మీదనే ఉందామని.. కేసీఆర్ ను రోడ్డు మీదికి ఈడ్చే వరకు విశ్రమించకూడదు… కేసీఆర్ కు గుణపాఠం చెబితే తప్పితే మనకు విముక్తి లభించదని అన్నారు.

అమెరికాలో చిప్పలు కడుక్కొని వచ్చిన నీ కొడుకు ఐటీ మంత్రి కావచ్చు కానీ..ఇక్కడ పుట్టిన బిడ్డలకు ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. మూడు రోజులు ఎవరూ పుట్టిన రోజు ఉత్సవాలు జరుపుకోరని.. మూడు రోజుల సంతాప దినాలు జరుపుతారని కేటీఆర్ ను ఎద్దేవా చేశారు. డీజీపీకి అహంభావం.. బలుపా.. ఓ పార్లమెంట్ సభ్యుడు ఫోన్ చేస్తే కనీసం రెస్పాన్స్ కారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నారని.. ఇంత కన్నా మీరు బ్రోతల్ పనిచేసుకున్నా ఇజ్జత్ ఉంటుందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version