రేసులో వెనుకబడిన ‘బండి’…రేవంత్ రెడ్డి సీన్ మార్చేస్తున్నారా?

-

మొన్నటివరకు తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కువగా వార్తల్లో నిలిచేవారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ హైలైట్ అవుతూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారో, అప్పటినుంచి ప్రజల ఫోకస్ కాస్త కాంగ్రెస్‌పైకి వెళ్లింది. ఎప్పటికప్పుడు రేవంత్, కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తూ హైలైట్ అవుతున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

అదే సమయంలో షర్మిల, తీన్మార్ మల్లన్న, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారి రాజకీయంతో బండి మరింత వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ వరకు మాత్రమే బీజేపీ తరుపున ఈటల, కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ దూకుడుగా ఉంటున్నట్లు కనిపించడం లేదు.

అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు మాదిరిగా, బీజేపీ శ్రేణులు యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా కాంగ్రెస్‌కు ఉన్నట్లు, బీజేపీకి కింది స్థాయిలో సరైన నాయకులు లేరు. ఈ విషయంలో కూడా బండి సంజయ్ పెద్దగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇంకా ఏదో మీడియా సమావేశాల వరకే పరిమితమైతే క్షేత్ర స్థాయిలో బీజేపీ బలపడటం చాలా కష్టం. రేవంత్ మాదిరిగా జనంలోకి వెళుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే ఏమన్నా బెనిఫిట్ ఉంటుంది. ఇక రేవంత్ నిర్వహించినట్లు ఇంద్రవెల్లి సభ మాదిరిగా బండి సంజయ్…బీజేపీ శ్రేణులని యాక్టివ్ చేసే ఓ సభ నిర్వహిస్తే రాజకీయం ఒక్కసారిగా మారుతుంది.

అయితే బండి సంజయ్ అతి త్వరలోనే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. దీని వల్ల పార్టీకి మైలేజ్ రావొచ్చు. కానీ బండి పాదయాత్రని హైలైట్ అవ్వకుండా రేవంత్ మరో ప్లాన్‌తో వచ్చి రాజకీయాన్ని మార్చేయొచ్చు. కాబట్టి  బండి రానున్న రోజుల్లో మరింత దూకుడుగా ఉంటేనే బీజేపీ రేసులో ఉంటుంది. లేదంటే అంతే సంగతులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version