తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకి అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సిఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. దీంతో అధికార లాంఛనాలకి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాదులో గాంధీ హాస్పిటల్లో లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.
దీంతో లాస్య భౌతికకాయాన్ని సందర్శనార్థం అశోక్ నగర్ దోమలగూడలోని ఆమె నివాసానికి తరలిస్తున్నారు. తర్వాత మారేడుపల్లిలో తండ్రి సాయన్న సమాధి పక్కనే అంత్యక్రియలు కూడా చేయబోతున్నారు ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ శివారులో పటాన్చెరు సమీపంలో ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదానికి గురి అయ్యారు.