ఒక మంచి వ్యక్తి.. కానీ రాంగ్ ప్లేస్ లో వున్నారు.. షర్మిల షాకింగ్ కామెంట్స్..!

-

మంగళగిరి వైసీపీ సమన్వయకర్త బాధ్యతల్ని గంజి చిరంజీవికి ఇవ్వడంతో వైసిపికి మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసేసారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన ఏపీపీఎస్సీ చీఫ్ వైయస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరారు ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంలో పాటు రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ సొంత గూటికి వచ్చేసారు రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి తన సోదరుడు అయోధ్య రామిరెడ్డి తో మంతనాలు జరిపారు చర్చలు ఫలించడంతో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి సీఎం జగన్ సమక్షంలో ఇంకోసారి వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఈ క్రమంలో ఆళ్లపై షర్మిల ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు తనకి చాలా దగ్గర మనిషి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని అన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అన్నారు. వైసిపి నుండి కాంగ్రెస్ లోకి చేరినప్పటి నుండి ఆయనపై ఒత్తిడి ఎంత అంతా కాదని ఆయన చెల్లిగా బాధని అర్థం చేసుకోగలరని ఒక మంచి వ్యక్తి రాంగ్ ప్లేస్ లో ఉన్నారని షర్మిల అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news