దేశంలో అత్యంత ప్రమాదకరమైన నేత కేసీఆర్‌ : రేవంత్‌ రెడ్డి

-

మరోసారి సీఎం కేసీఆర్‌ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత ప్రమాదకరమైన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నమ్మదని చెప్పారు రేవంత్ రెడ్డి . కేవలం బీజేపీకి మేలు చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ డ్రామాను మొదలు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి ఒక డిప్యూటీ తహసీల్దార్ ప్రవేశించడం ఈ రాష్ట్రంలోని దారుణ పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు రేవంత్ రెడ్డి.

ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికే భద్రత లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని రేవంత్ రెడ్డి అన్నారు. తనలాంటి పరిస్థితి ఏ మహిళకైనా వస్తే వెంటనే 100 నెంబర్ కు డయల్ చేయాలని స్మితా సబర్వాల్ అంటున్నారని… కేసీఆర్ మాత్రం 100 పైపర్స్ (మద్యం బ్రాండ్) అంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే అధికారిణికే భద్రత లేని పరిస్థితుల్లో రాష్ట్రం
ఉందని చెప్పారు రేవంత్ రెడ్డి .

Read more RELATED
Recommended to you

Exit mobile version