కుక్కలకు కుటుంబ నియంత్రణ..తెలంగాణ రాజకీయాల్లో విడ్డూరం.!

-

తెలంగాణ రాజకీయాల్లోకి కుక్కలు ఎంట్రీ ఇచ్చాయి. రాజకీయానికి కాదేదీ అనర్హం అన్నట్లు..ఇప్పుడు కుక్కలపై కూడా రాజకీయం నడుస్తోంది. తాజాగా హైదరాబాద్ అంబర్‌పేట పరిధిలో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు ప్రదీప్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేయాలని జి‌హెచ్‌ఎం‌సి మేయర్ విజయలక్ష్మీ అధికారులని ఆదేశించారు. అదే సమయంలో కుక్కకు ఆకలి వేసి పిల్లాడిని కరిచిందని మేయర్ చెప్పుకొచ్చార్.

కొన్ని రోజుల నుంచి ఆ కుక్కలకు ఓ మహిళా మాంసాహారం పెట్టేది అని…కానీ గత రెండు రోజుల నుంచి ఆమె లేదని, అందుకే కుక్కలు ఆకలితో పిల్లాడిని కరిచాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈ సంఘటనపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, ఐదేళ్ల చిన్నారిని కుక్కలు కరిచి చంపేస్తే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

హైదరాబాద్ మేయర్ ఏమో…కుక్కలకు ఆకలేసింది అని మాట్లాడుతున్నారని… వీధికుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని, కుక్కలు కరిచి మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారని, ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు.

తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. అయితే కుక్కలకు ఆకలి వేసి కరిచాయని మేయర్ మాట్లాడటం బాధ్యతారహిత్యమని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. మొత్తానికి కుక్కలు…చిన్న పిల్లలపై దాడులు పెరుగుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు..పిల్లలని ఒంటరిగా బయటకు పంపడం మంచిది కాదనే చెప్పాలి. తల్లిదండ్రులు పక్కన ఉంటూ..పిల్లలని బయటకు తీసుకెళితే బెటర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version