టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పరామర్శించి, ఆయనకు సంఘీభావం తెలపనున్నారు. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కంపెనీ నిధులను అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై శనివారం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
న్యాయమూర్తి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో రవిప్రకాశ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు.