రేవంత్ రెడ్డి చాలా అదృష్టవంతుడు.. బీజేపీ ఎమ్మెల్యే మహుశ్వర్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అదృష్టవంతుడు అని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఒక స్థానంలో ఓడిపోయినా ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం కేసీఆర్ కూడా ఒక స్థానంలో గెలిచి.. మరో స్థానంలో ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి కాలేకపోయారు. గతంలో ఎప్పుడూ ఇలా జరుగలేదు. ఆయనకు పాలనా అనుభవం లేదు. సీనియర్లు సలహాలు, సూచనలు తీసుకుంటారని ఆశీస్తున్నాను.

రేవంత్ రెడ్డి ఐపీఎస్, ఆఫీసర్ కాదు.. మంత్రులు కానిస్టేబుళ్లు కాదు. దూకుడు తగ్గించి, అందరి మాట వినాలి. అప్పులు చేయకుండా పన్నులు పెంచకుండా హామీలను నెరవేర్చాలని సూచించారు మహేశ్వర్ రెడ్డి. బీజేపీ పక్షాన నూతన రాష్ట్ర ప్రభుత్వానికి 100 రోజులు సమయం ఇస్తాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది. అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినట్లుగా కనపడుతుంది.

బడ్జెట్ కు భారంగా కాంగ్రెస్ పార్టీ హామీలున్నాయి. రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తుందో చెప్పాలి. తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్రను విస్మరించారు.తెలంగాణ ఏర్పాటుకు రాజ్యసభలో బీజేపీ సంపూర్ణ మద్ధతు తెలిపింది. సకలజనులతోనే తెలంగాణ ఏర్పాటు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version