చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము – రేవంత్ పై కేటీఆర్ ఫైర్

-

కాంగ్రెస్ నాయకులు కష్టపడి కట్టుకున్న పుట్టలో చీమలు చొరబడట్లు పార్టీలోకి చొరబడి సీఎం అయింది రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.  తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే రేవంత్ రెడ్డి సీఎం అవ్వలేదు..హైకమాండ్ చేస్తే అయ్యారు. బయటదేశం నుంచి వచ్చిన వాళ్లకు అధ్యక్షులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ NRI ల గురించి మాట్లాడితే ఎలా? NRI అంటే బయట వాళ్ళే అనే కాంగ్రెస్ నాయకుల మాటలు NRI లు ఆలోచన చేయాలి.

బస్సు, బంగారం ఫ్రీ అని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము కష్టపడి పెంచిన సీట్లలో కాంగ్రెస్ నాయకులు కూర్చొని ఎంజాయ్ చేయండి. అధికారంలో కూర్చున్న ఒక్కరికీ కూడా ITIR తెల్వదు. అభ్యుదయం అని తెల్వని వాళ్ళు అవాస్తవాలు చెబుతున్నారని పేర్కొన్నారు కేటీఆర్. మరోవైపు  అచ్చొచ్చిన ఆంబోతు అని సీఎం మాట్లాడరని అన్నారు. చీమలు పెట్టిన పుట్టలో ఎవ్వరూ దూరారో అందరికీ తెలుసు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version