భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆరఎఫ్ బృందాలను మోహించాలన్న సీఎం రేవంత్ రెడ్డి… లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు.

రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచనలు చేశారు. అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పురపాలక, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.