మళ్లీ మోడీనే గెలుస్తారనే విషయం రేవంత్ రెడ్డికి తెలుసు: డీకే అరుణ

-

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలను రచిస్తున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షురాలు, మహబూబ్ నగర్ బీజేపీ ఎంపి అభ్యర్థిని డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ..కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారలోకి వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, మోడీనే గెలుస్తారని విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసని ఆమె అన్నారు .

తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ఆమె ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 12 నుండి 15 లోక్ సభ స్థానాలు గెలుస్తుందని ఆమె జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమే అధికారలోకి వస్తుందని.. మరోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version