భూ కబ్జా ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ స్పందించారు. ఆదివారం ఆయన ఓ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ.. షేక్ పేట్లో స్థలాన్ని చట్టబద్దంగా కొనుగోలు చేశానని క్లారిటీ ఇచ్చారు. డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి ల్యాండ్ కబ్జా చేశాననేది అవాస్తవమని కొట్టిపారేశారు. ల్యాండ్కు సంబంధించిన విషయంలో న్యాయపరమైన సమస్య ఉంటే ముందు లీగల్ నోటీసులు ఇవ్వాలి.. అంతేకానీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫోర్జరీ కేసు పెట్టడం సరికాదని హితవు పలికారు.
రాజకీయ కక్షతోనే తనపై బురదజల్లాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కాగా, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం 14లో ఫోరరీ డాక్యుమెంటతో సంతోష్ తమ భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే నవయుగ కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎంపీ సంతోష్ప కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో భూ కబ్జా ఆరోపణలపై సంతోష్ క్లారిటీ ఇచ్చారు.