సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ కోవర్ట్ అని, మోదీ కోసమే పనిచేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. యూపీఏ భాగస్వామ్య పార్టీలను చీల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నానని లీకులు ఇస్తున్నారని.. కేసీఆర్ కాంగ్రెస్ అనుకూలంగా ఉండీ.. యూపీఏ భాగస్వాములను చీల్చేందుకు కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచి.. మోదీ కుర్చీని పదిలం చేసేందుకు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ మమతా బెనర్జీతో, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రేతో చర్చిస్తున్నారని.. వీరంతా యూపీఏ భాగస్వాములే అని.. నరేాంద్ర మోదీకి వ్యతిరేఖంగా కొట్లాడుతున్నారని.. సోనియా గాంధీని సమర్థిస్తున్నారని.. వీరందరిని విడతీసి నేషనల్ ఫ్రంట్, పెడరల్ ఫ్రంట్ పెట్టి.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని చెడగొడుతున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో కాంగ్రెస్ తో పనిచేసేందుకు కేసీఆర్ ఉత్సాహం చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగానే నరేంద్రమోదీని ఓడించాలంటే.. మోదీని బలహీన పరిచే కార్యాచరణ చేయడం లేదని.. కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని కేసీఆర్ పై విమర్శించారు. కాంగ్రెస్ ని బలహీన పరిచేందుకు సుపారీ తీసుకున్న సుపారీగ్యాంగ్ లీడర్ కేసీఆర్ అని అన్నారు.