ముందస్తుపై కేసీఆర్ కొత్త ఎత్తు.. రేవంత్‌ లాజిక్ ఫిక్స్?

-

తెలంగాణ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ వ్యూహాలు అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఒక వ్యూహం ప్రత్యర్ధికి అర్ధమైపోతుందనే లోపే మరి కొత్త ఎత్తు వేసి ప్రత్యర్ధులని చిత్తు చేస్తారు. అయితే కే‌సి‌ఆర్ ఎత్తులకు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఎత్తులు వేస్తున్నారు. కే‌సి‌ఆర్ వ్యూహాలు ఏ సమయానికి ఎలా ఉంటాయనేది క్లియర్‌గా చెప్పేస్తున్నారు. మొన్న ఆ మధ్య కే‌సి‌ఆర్ తప్పుకుని కే‌టి‌ఆర్‌ని సి‌ఎం చేసేస్తారని బాగా ప్రచారం జరిగింది…ఈ ప్రచారం అందరూ నమ్మారు. కానీ రేవంత్ మాత్రం అది జరగని పని అప్పుడే చెప్పారు. తర్వాత అదే జరిగింది. అలాగే ఈటలని బుక్ చేసి బయటకు పంపబోతున్నారని కూడా మాట్లాడారు. నెక్స్ట్ అదే జరిగింది.

అయితే ఇప్పుడు కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని, ఇంకా రెండున్నర ఏళ్ళు పూర్తిగా ఉంటామని తేల్చి చెప్పారు. కానీ కే‌సి‌ఆర్ పైకి ముందస్తుకు వెళ్ళేది లేదని చెప్పి, ప్రతిపక్షాలని కన్ఫ్యూజ్ చేసి, ముందస్తుకు వెళ్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే కే‌సి‌ఆర్ అంత గట్టిగా ముందస్తుకు వెళ్ళేది లేదని చెప్పిన రేవంత్ రెడ్డి మాత్రం…కే‌సి‌ఆర్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని గుజరాత్ ఎన్నికలతో పాటే తెలంగాణ ఎన్నికలు కూడా జరగనున్నాయని అంటున్నారు.

గుజరాత్ ఎన్నికలు 2022 డిసెంబర్‌లో జరగనున్నాయి…కాస్త అటు ఇటు అయితే 2023 మొదట్లో జరగొచ్చు. అప్పుడే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని రేవంత్ అంటున్నారు. 2023 డిసెంబర్ వరకు టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వానికి సమయం ఉంటుంది. కానీ కే‌సి‌ఆర్ ఖచ్చితంగా ముందస్తు ప్లాన్ లేదంటూనే ముందస్తుకు వెళ్తారని రేవంత్ అంటున్నారు.

అంటే ప్రతిపక్షాలు అలెర్ట్ గా లేని సమయంలోనే దెబ్బవేయడానికి చూస్తారు…గత ఎన్నికల్లో అదే చేశారు. దీంతో టి‌ఆర్‌ఎస్‌కు బెనిఫిట్ అయింది. ఇప్పుడు కూడా కే‌సి‌ఆర్ అదే ఎత్తుతో ముందుకొస్తారని రేవంత్ భావిస్తున్నారు. పైగా ఇంకా పూర్తి సమయం అధికారంలో ఉంటామని చెప్పి, టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలని చేజారినివ్వకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా కే‌సి‌ఆర్ ముందస్తు విషయంలో రేవంత్ లాజిక్ కరెక్ట్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version