Akhil Akkineni: “అయ్య‌గారు మిమ్మ‌ల్నీ త్వ‌ర‌లో క‌లుస్తా.. ఇప్పుడూ నా కంటే మీరే పాపుల‌ర్‌”!

-

Akhil Akkineni: సోష‌ల్ మీడియా ఎవరిని.. ఎలా ..పాపుల‌ర్ చేస్తుందో ? ఓవ‌ర్ నైట్ స్టార్ల‌ల‌ను చేస్తుందో అస‌లు తెలియ‌దు. తాజాగా ఒక ప‌దం ఒక వ్య‌క్తిని ఓవ‌ర్ నైట్ స్టార్ గా నిలుచ‌బెట్టింది. అత‌డే అఖిల్ అక్కినేని వీర అభిమాని నాగ‌రాజు.. ఆయ‌న అఖిల్ సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా.. సినిమా రివ్యూ తీసుకునే వ్య‌క్తి.. అత‌ని దగ్గ‌రికి వ‌చ్చారు.ఆ స‌మ‌యంలో ఆ అభిమాని త‌న‌దైనా శైలిలో రివ్యూ ఇచ్చాడు. అఖిల్ అయ్యగారే కరెక్ట్…ఆయనే రావాలి..ఆ అయ్యగారే రావాలి.. అయ్యగారే నెం 1’ అంటూ మైక్ ముందు అరిచారు. ఇక దానికి సంబందించిన వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయ్యింది.

ఇదిలా ఉంటే తాజాగా…అఖిల్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో వారు అడిగిన ఓపికతో సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా ఇన్‌స్టాలో ఓ అభిమాని అఖిల్‌ను.. ‘అయ్యగారు’ గురించి ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా నవ్విన అఖిల్‌ నాగరాజుపై ప్రశంసలు కురిపించారు.
మిమ్మల్ని ఒకసారి కలవాలి. మీ వీడియోలను చూశాను. నాకన్న ఆయ‌నే చాలా ఫేమస్‌ అయ్యారు. మీరిచ్చిన ‘అయ్యగారు’ అనే పదం నాలైఫ్‌ని టేక్‌ఓవర్‌ చేసింది. ఈ పదాన్ని ఏకంగా మా సినిమాలో పెట్టేశారంటే చాలా సంతోషంగా ఉంది. మీరు క్షేమంగా ఉండండి, ఎప్పుడూ అదే ఉత్సాహాన్ని కలిగివుండండి. మీ ఆదరణ అభిమానానికి నా కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చారు అఖిల్‌.

ఇక అఖిల్ చేసిన కామెంట్ తర్వాత అయ్యగారు చాలా లక్కీ అని ఒక యంగ్ హీరో అతన్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాడని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. మరి అయ్యగారి అభిమాని అఖిల్ ను కాలుస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version