వీడియో : వంట చేస్తున్న రేవంత్…!

-

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపధ్యంలో అందరూ కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడో కొందరు మినహా ఎవరూ బయటకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు. రాజకీయ నాయకులు సహా ఎవరూ కూడా బయటకు రావడం లేదు. అనేక ప్రాంతాల్లో రోడ్లు అన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ప్రజలను ఎక్కడిక్కడ పోలీసులు కట్టడి చేస్తున్నారు. దీనితో అందరూ తమ తమ కుటుంబాలతో గడుపుతున్నారు.

ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలు కూడా నిర్మానుష్యంగానే ఉన్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. కరోనా వైరస్ నేపధ్యంలో ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే గడుపుతున్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంటే.. వ్యాపారులు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు బిజీగా గడిపిన వాళ్లంతా కుటుంబ సభ్యులతో సేద తీరుతున్నారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో వంట చేస్తున్నారు. ఇంట్లో వాళ్లకు రుచికరమైన భోజనం వండి పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు రాజకీయ నాయకులు అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల నాయకులు మీడియా ముందుకి కూడా రావడం లేదు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version