ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఉన్న కొద్దీ ఇతర దేశాలకు కూడా పాకుతుంది. దాదాపు వందకు పైగా దేశాల్లో విస్తరించి ఉన్న ఈ వైరస్ ఉన్న కొద్ది విస్తరించుకుంటూ పోతుండటంతో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రధానులు, నాయకులు బెదిరి పోతున్నారు. ఇండియాలో ఈ వైరస్ ప్రభావం ఉన్న కొద్ది రోజు రోజుకి పెరుగుతుంది. ఇటలీలో అయితే దాదాపు 70 వేలకు దగ్గరలో బాధితుల సంఖ్య ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగానే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ వైరస్ కి మందు లేకపోవటంతో నివారణ చేపట్టడమే ప్రస్తుతం ముందున్న పరిష్కారమని చాలా దేశాలు లాక్ డౌన్ చేయడం జరిగింది.
ఇంకా అనేక విషయాల గురించి చెప్పిన బ్రహ్మంగారు తాజాగా ఈ వైరస్ గురించి కూడా చెప్పినట్లు…ఆయనకు సంబంధించిన ప్రవచనాల చరిత్రలో ఇటీవల బయటపడింది. దీనికంటే ఇంకా పెద్ద గండాలు ముందు ముందు రోజుల్లో రాబోతున్నట్లు తెలపడం జరిగింది. ఇలా ఉండగా తాజాగా మరో కొత్త వైరస్ చైనాలో బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. దాని పేరు హంటా వైరస్ అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో విస్తరించకుండా ఉండాలంటే ఇంటిలో ఉన్న అడుగు బయట పడకూడదని నాయకులు చెబుతున్నారు.