తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌పి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి అంశంలోనూ కేసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో తమకు ధీటుగా వస్తున్న బిజేపికి చెక్ పెట్టాలని కూడా చూస్తున్నారు. ఈ క్రమంలోనే టిఆర్‌ఎస్, బిజేపిలు వేరు వేరు కాదని రేవంత్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మోడీ-కేసిఆర్‌లు ఒకటే అని తెలంగాణ రాజకీయాల్లో హైలైట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ పరిణామం తెలంగాణలో టిఆర్‌ఎస్‌పై పోరాడుతున్న బిజేపికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడుప్పుడే పుంజుకుంటున్న పార్టీకి రేవంత్ చేస్తున్న విమర్శలు ఇబ్బంది అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే రేవంత్ చేతికి మరో అస్త్రం చిక్కింది. తెలంగాణలో కయ్యం పెట్టుకుని ముందుకెళుతున్న బిజేపి, టిఆర్‌ఎస్‌లు కేంద్రంలో మాత్రం వియ్యం పెట్టుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇక ఇందుకు ఉదాహరణగా చాలా ఉన్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రానికి, కేసిఆర్ మద్ధతుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యలయం నిర్మించుకోవడానికి స్థలం కూడా కేటాయించింది. దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు లేదు. కానీ మొదటిసారి టిఆర్‌ఎస్‌కు కార్యలయం కట్టుకోవడానికి స్థలం ఇచ్చింది. ఇక ఈ అంశమే ఇప్పుడు టిఆర్‌ఎస్, బిజేపిల మధ్య ఉన్న అనుబంధానికి ఉదాహరణ అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
అలాగే ఢిల్లీలో కేసిఆర్, ప్రధాని మోదీ, అమిత్ షా, గజేంద్ర షెకావత్‌లని కాలుస్తున్నారు. అయితే ఒక సీఎం హోదాలో కలిసిన కూడా, బిజేపితో కేసిఆర్‌కు అనుబంధం ఉందనేది రేవంత్ ఇంకా హైలైట్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా బిజేపి, టిఆర్‌ఎస్‌లని ఇరుకున పెట్టే అస్త్రం మాత్రం రేవంత్‌కు దొరికినట్లే కనిపిస్తోంది.