చంద్రబాబు కూడా కాంగ్రెస్ మనిషే – రేవంత్‌ రెడ్డి సంచలనం

-

చంద్రబాబు కూడా కాంగ్రెస్ మనిషే అంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి..సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపురం మండలం గుడిమల్కాపూర్, పోతులాపురం, అల్లం దేవి చెరువు, సర్వేల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మనిషి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా…ఒకప్పుడు చంద్రబాబు కూడా కాంగ్రెస్ మనిషేనన్నారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బిజెపి జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తుంది…కెసిఆర్ పై కొట్లాడినందుకే నేను జైల్ కు వెళ్లానని తెలిపారు. జైల్ లో తిన్న చిప్ప కూడు సాక్షిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు, సోనియా గాంధీ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తా. అందుకోసం వందసార్లు అయినా జైలుకెళ్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సొంత ఊరు చుట్టూ కూడా రోడ్లు లేవని ఫైర్‌ అయ్యారు.

నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందేనని..కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను కేసీఆర్ తన పార్టీలో కలుపుకున్నాడు…కమ్యూనిస్టు నేతలు ఎటు వెళ్లిపోయినా… కార్యకర్తలు మాత్రం ఆత్మ సాక్షిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మునుగోడులో ఆడబిడ్డకు టికెట్ ఇచ్చాము… మునుగోడు ఆడబిడ్డలంతా ఒకవైపు నిలబడి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version