తెరాస అధినేత కేసీఆర్ ని ప్రధాన టార్గెట్ గా రాజకీయాల్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం మరికొద్ది రోజుల్లో కారెక్కెందుకు సిద్ధం అవుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి..అవునా..ఇది నిజమేనా అనే సందేహం వస్తోంది కదా…ఏమే కాలమే ఇలాంటి విషయాలకు సమాధానం చెబుతోంది. తెలంగాణలో అధికార తెరాస పార్టీ తిరుగులేని శక్తిగా ప్రజల ఆశీర్వాదంతో ఎదిగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ఈనెల 21 నుంచి జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సైతం తెరాస బలపరిచిన అభ్యర్థులే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్ లుగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైన నాడు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నేతల్ని తమ పార్టీలో కలుపుకున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్యూహాన్ని తెరాస అమలు చేస్తోన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో తెదేపాను ఖాళీ చేసిన తెరాస మిగిలిన పార్టీ నేతలకు తమ పాలన ఫలితాలను వివరించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే తెరాస అధినేత పై ఒంటికాలితో లేచే వంటేరు ప్రతాప్ రెడ్డి సైతం తెరాస పాలనకు సలాం కొట్టి కారెక్కారు… కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతగా, మాస్ ఫాలోయింగ్ ఉన్నటు వంటి రేవంత్ రెడ్డి గురించి కూడా ఆ పార్టీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో అసలు కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుదంటే దానికి కారణం తానే అని ఓ దశలో భావించిన నేతగా రేవంత్ కి పేరుంది. అయితే ఊహించని రీతిలో ఓటమి భారంతో వున్న రేవంత్‌రెడ్డిని స్నేహ పూర్వక వాతావరణంలో తమ వైపు తిప్పుకుంటే ఎలా ఉంటుందనే విషయాన్ని పలువురు తెరాస నేతలు అధినేతతో చర్చించినట్లు తెలుస్తోంది. మరో వైపు రేవంత్ రెడ్డి వంటి మౌత్ పీస్ మన పార్టీలోకి వస్తే మనకు ఢోకా ఉండదన్నారు. అటు తెరాస అధినేత కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ఇటు యువ నేత కేటీఆర్ స్నేహ పూర్వక వ్యూహాలు పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
త్వరలో జరగనున్న జనరల్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో తెరాస పార్టీలోకి కాంగ్రెస్ నుంచి పలువురు కీలక నేతలు రావడం నూటికి నూరు శాతం వాస్తవం అన్నట్లు ఉంది. అదే జరిగితే ఇక కారు వేగానికి ఎంత మంది అడ్డొచ్చిన వారికి రిస్క్ తప్పదు కదా అంటూ రచ్చబడ్డల దగ్గర పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే మన పెద్దలు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని చెప్పారనుకుంటా..