కె.జి.ఎఫ్ సూపర్ అంటున్న కోలీవుడ్ స్టార్

-

కన్నడ స్టార్ హీరో యశ్ లీడ్ రోల్ లో ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ, హింది, కన్నడ భాషల్లో రిలీజైంది. డిసెంబర్ 21న రిలీజైన ఈ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీస్ ఇప్పటికే సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇక ఆ లిస్ట్ లో లేటుగా.. లేటెస్ట్ గా స్పందించాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.

ఇతర హీరోల సినిమాలు అసలు చూడని విజయ్ కె.జి.ఎఫ్ సినిమా చూడటం జరిగిందట. సినిమా చూసిన విజయ్ అద్భుతంగా ఉందని కొనియాడారట. అంతేకాదు హీరో యశ్ నటన గురించి ప్రస్థావించినట్టు తెలుస్తుంది. తెలుగులో కూడా కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సేఫ్ ప్రాజెక్ట్ అయ్యింది. సినిమాను తెలుగులో సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. ఏ కన్నడ సినిమా కూడా తెలుగు, తమిళ భాషల్లో నెలకొల్పని రికార్డులని కె.జి.ఎఫ్ సృష్టించింది. చాప్టర్ 1 అనుకున్న విధంగా సక్సెస్ అయ్యింది.. మరి చాప్టర్ 2 ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version