రేవంత్ వర్సెస్ సీనియర్లు…పూర్తిగా ముంచేస్తున్నారు!

-

మంచి అవకాశాలని నాశనం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటు అనే చెప్పాలి..అయితే వారి అవకాశాలని ఎవరో నాశనం చేయరు…కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లే నాశనం చేసేసుకుంటారు…అంటే ప్రత్యర్ధులతో పని లేకుండా వారికే వారే చెక్ పెట్టుకుంటారు…ఇటీవల పంజాబ్‌లో అదే జరిగింది..పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అక్కడ కాంగ్రెస్ నేతలే…ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అక్కడ ప్రత్యర్ధులు కాంగ్రెస్ పార్టీని ఓడించలేదు…కాంగ్రెస్ నేతలే…కాంగ్రెస్‌ని ఓడించుకున్నారు.

ఇప్పుడు తెలంగాణలో కూడా అదే దిశగా కాంగ్రెస్ నేతలు వెళుతున్నట్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి…ఇప్పటికే అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌పై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..అలాంటప్పుడు కాంగ్రెస్‌కు బాగా బెనిఫిట్ అవుతుందనే చెప్పొచ్చు…ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే..వారికే బలపడటానికి అడ్వాంటేజ్ ఉంది…ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న సమయంలో…కాంగ్రెస్ నేతలు తమ వద్దు అన్నట్లు ప్రజలని బీజేపీ వైపుకు డైవర్ట్ చేశారు.

అసలు తెలంగాణలో బీజేపీ బలపడటానికి కారణమే కాంగ్రెస్ పార్టీ…ఆ పార్టీకి వచ్చిన మంచి అవకాశాలని వాడుకోకుండా…వారిలో వారే గొడవపడి బీజేపీకి ఛాన్స్ ఇచ్చేశారు. సరే బీజేపీకి నిదానంగా బలపడుతుంది..కానీ కాంగ్రెస్ పార్టీకు ఉన్న బలం బీజేపీకి లేదు..అలాంటప్పుడు కాంగ్రెస్ ఎదగడానికి మంచి ఛాన్స్ ఉన్నట్లే…అయినా సరే ఆ అవకాశం తమకు వద్దు అన్నట్లే కాంగ్రెస్ నేతలు కొట్లాడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గం, సీనియర్ల వర్గం అన్నట్లు తయారైపోయింది…నిజానికి రేవంత్ గాని, రేవంత్ వర్గం గాని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసమే కృషి చేస్తుందని చెప్పొచ్చు…కానీ సీనియర్లు మాత్రం అలా అనడం లేదు..రేవంత్ వర్గం కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తుందని అంటున్నారు..తాజాగా కూడా వరుస పెట్టి సీనియర్లు సమావేశం అవుతున్నారు..రేవంత్‌పై ఫైర్ అవుతున్నారు..ఏమన్నా పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గతంగా చూసుకోవచ్చు…కానీ బయటకొచ్చి సీనియర్లు రచ్చ లేపుతున్నారు..పైగా వీహెచ్ తాజాగా మంత్రి హరీష్‌ని కలిసి సమావేశాలు పెట్టడంపై రేవంత్ వర్గం ఫైర్ అవుతుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని ముంచేది సీనియర్ల వర్గమే అని రేవంత్ వర్గం అంటుంది..పరిస్తితి చూస్తే అలాగే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version