రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్ రెడ్డి

-

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపి కండువా కప్పుకుంటారని వస్తున్న వార్తలపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు రేవంత్. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై తుది నిర్ణయం హై కమాండ్ తీసుకుంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే మరోవైపు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి కమిషన్లు నొక్కడానికే కేసీఆర్ ఢిల్లీ వచ్చారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

తమకున్న సమాచారం మేరకు కెసిఆర్ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశమై వివిధ బ్యాంకుల నుంచి రావలసిన లోన్లపై సమావేశమయినట్టు తమకు సమాచారం ఉందన్నారు రేవంత్ రెడ్డి. లోన్లు తీసుకువచ్చి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి అందులో నుంచి కమిషన్లు మెక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం కొట్టుకుపోతుంటే కనీస బాధ్యత లేకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. కెసిఆర్, మోడీ ఇద్దరూ తెలంగాణకి అన్యాయం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో వచ్చిన ఉపద్రవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పట్టించుకోవడంలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version