కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, ప్రజాక్షేత్రంలో రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగడతామని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్‌ను ఖమ్మం జైలులో శనివారం ఉదయం ఎమ్మెల్సీ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ కారణం లేకుండా గులాబీ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం రేవంత్ సర్కార్ తరం కాదని ఎమ్మెల్సీ కవిత హెచ్చరికలు చేశారు.