భారత ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. నిన్న కులగణన ప్రజేంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మోడీ బీసీ కాదని.. 2001లో గుజరాత్ సీఎం అయిన తరువాత ఆయన కులాన్ని బీసీలలో కలిపారని తెలిపారు. అంతకు ముందు ఆయన కులం ఓసీ అన్నారు. అందుకే బీసీ రిజర్వేషన్ చేపట్టలేదని.. జనాభా లెక్కలు చేయలేదన్నారు.
బీసీలపై ప్రేమ ఉంటే 2021లో మోడీ జనాభా లెక్కలు చేసేవారని తెలిపారు. తాజాగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కులగణన సర్వే గందరగోళం లో పడిందన్నారు. సర్వేలో జనాభా ఎందుకు తగ్గింది అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. కులగణన సర్వేతో బీసీలకు న్యాయం జరగదు అన్నారు. 7, 8 ప్రశ్నలుంటే సరిపోతుంది. 70, 75 ప్రశ్నలు వేసి సర్వేను గందరగోళాన్ని చేస్తున్నారని విమర్శించారు.