రేవంత్ సర్కారుకు కిడ్నీ బాధితుల సెగ.. ప్రజాభవన్ ఎదుట నిరసన!

-

రేవంత్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల నుంచి సెగ మొదలైంది. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ ఎదుట కిడ్నీ రోగులు ఆందోళన బాట పట్టారు. కిడ్నీ రోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరి పెన్షన్‌ను కల్పించాలని శాంతియుత నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కిడ్నీ బాధితులు మాట్లాడుతూ..కిడ్నీ రోగుల ఆరోగ్యం, మందులకు అయ్యే ఖర్చుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని కోరారు. ఏడాదికి మూడు, నాలుగు సార్లు హాస్పిటల్ వెళ్లాల్సి వస్తుందని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

కిడ్నీ రోగులపై రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేసి.. ఏపీ మాదిరి తెలంగాణ ప్రభుత్వం కూడా రూ.10 వేల పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.గత జనవరిలో కిడ్నీ పేషెంట్స్‌ను ఆదుకోవాలని ప్రజాభవన్‌లో కలిసి విజ్ఞప్తి చేసినా నేటికి సర్కార్ పట్టించుకోవడం లేదని వాపోయారు.పెన్షన్ ఇచ్చి తమకు మెరుగైన వైద్యం అందించాలని రోగులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమకు అన్ని చోట్లా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయాన్నిఈ సందర్బంగా వారు గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news