టీఆర్ ఎస్ ఎంపీలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలను కోడిగుడ్లు, టమాటలు, చీపుర్లతో కొట్టి సన్మానించాలంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రప్రభుత్వం అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించకపోవడం దురదృష్టకరమని… అధికారుల వ్యవహారశైలి కూడా కేసీఆర్ కు అనుగుణంగా ఉందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మొక్కుబడి ఆందోళన చేస్తున్నారని…
ఎంపీ లు సేదదీరే పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో టీఆర్ఎస్ ఎంపీలు దీక్ష చేస్తున్నట్లు నటిస్తున్నారని చురకలు అంటించారు.
టీఆర్ఎస్ ఎంపీల ప్రవర్తన చాలా చిల్లరగా ఉందని.. కేసీఆర్ , ఎంపీల ప్రకటనల వల్ల తెలంగాణ రైతాంగ సమస్యలు పరిష్కారం కాదన్నారు. మిల్లర్ల మాఫియాలో బందీ అయిన రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రయోజనాల కోసం ధాన్యం కొనుగోలును కుదించుకుందని.. రైతులను మిల్లర్ల మాఫియాకు అప్పగించిందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవని… 2018,2019,2020 లలో తెలంగాణ ప్రభుత్వం తనకు ఎఫ్.సి.ఐ ఇచ్చిన టార్గెట్ ను పూర్తిచేయలేదని ఫైర్ అయ్యారు. రేపటి నుంచి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చెయ్యరని..కేసీఆర్ ఆదేశాల మేరకు అందరూ హైదరాబాద్ పయనం అవుతారని మండిపడ్డారు. బిజెపి, టీఆర్ఎస్ ల మధ్య ఒప్పందంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసనను ముగిస్తున్నారన్నారు.