కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో కేసీఆర్‌కు చలి జ్వరం వచ్చింది : రేవంత్‌ రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం పట్టి పీడిస్తోందని విమర్శించారు. ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. సచివాలయ నిర్మాణంలోనూ దోపిడీ జరిగిందని వెల్లడించారు. తెలంగాణను బీఆర్ఎస్ వంచించిందని, ప్రతి రంగంలోనూ కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. అయితే, వచ్చే డిసెంబరులో తెలంగాణలో మరో అద్భుతం జరగబోతోందని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇక విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు రావడం ఖాయమని తెలిపారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో సీఎం కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు.

సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అన్నదే కాంగ్రెస్ విధానం అన్నారు. అధికారం కోల్పోతున్నామన్న భయం బిల్లా-రంగాలలో మొదలైందన్నారు. అందుకే స్థాయి లేకపోయినా సోనియా, రాహుల్ ను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. బిల్లా-రంగాలకు సూటిగా సవాల్ విసురుతున్నా.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలలో వేటిపైనైనా చర్చకు సిద్ధం.. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం చేశారో చర్చకు రండి అన్నారు. తేదీ చెప్పండి.. అమరవీరుల స్థూపం వద్ద చర్చకు మేం సిద్ధం అని స‌వాల్ విసిరారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version