రేవంత్ ఎందుకు సైలెంట్ అయ్యారంటారూ…?

-

తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా సరే కాస్త సంచలనంగానే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావటంలేదు. రేవంత్ రెడ్డి కొంతమంది నేతలు విషయంలో కాస్త సీరియస్ గా ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన సైలెంట్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను విమర్శించే విషయంలో ముందు నుంచి కూడా కాస్త సీరియస్ గా అడుగులు వేశారు.

కానీ ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ఆయన సైలెంట్ గా ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఏం జరుగుతుందో అర్థం కావటంలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మాత్రమే పరిమితమై ప్రచారం చేశారు. కాని ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పరిధిలో రేవంత్ రెడ్డి ప్రచారం చేసే విషయంలో ఆసక్తి చూపించలేదు. కొంతమంది కీలక నేతలతో కూడా ఆయన సమావేశం నిర్వహించలేదు.

మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇబ్బంది పడుతున్నారో తెలియదు కానీ ఆయన మాత్రం కేసీఆర్ కు కాస్త భయపడుతున్నారు అని అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకడుగు వేశారని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. అయితే రేవంత్ రెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంచనా వేసిన అది నిజం కాదని తెలియటంతో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version