జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసుపై వివిధ పార్టీల నాయకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అమ్నేషియా పబ్ కేసుపై బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారణ జరపాలన్నారు. సీపీ ఆనంద్ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచి పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు బెంజ్ కారు యజమాని ఎవరో చెప్పలేదన్నారు.
అలాగే ఇన్నోవా కారు ఎవరిదనే విషయాన్ని కూడా పోలీసులు ప్రకటించలేదన్నారు. అలాగే వాహనంపై ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ ఎవరూ తొలగించారో చెప్పాలన్నారు. పోలీసులు వాహనదారులకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదో చెప్పాలన్నారు. వాహనదారుల ఓనర్లను పిలిచి ఎందుకు విచారణ జరపడం లేదో తెలపాలన్నారు.