బండి సంజయ్ అరెస్టు పై రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్

-

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మొన్న రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. టిఆర్ఎస్ పార్టీ, బిజెపిల మధ్య ఈ వ్యవహారం పై మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా బండి సంజయ్ అరెస్ట్ పై కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

టిఆర్ఎస్, బీజేపీ డ్రామా ప్రారంభం అయిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. పార్ట్-1: బండి సంజయ్ అరెస్ట్ అని… పార్ట్-2: JP నడ్డా ను ఈరోజు కస్టడీలోకి తీసుకోనున్నారని… సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం లో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా చూపించడానికే ఇదంతా ? చేస్తున్నారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దీన్ని బహిర్గతం చేసాము ఇప్పుడు డ్రామా ఎలా జరుగుతుందో చూద్దామని ఎద్దేవా చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version