కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై నిత్యం ప్రశ్నిస్తున్న ఆర్జీ టీవీ జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా కోర్టు ఉత్తర్వులతో రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం జనగామ జైలులో ఉన్న ఆర్జీ టీవీ జర్నలిస్టు రాజ్ కుమార్‌ను శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు.
అంతకుముందు పల్లా, ఎర్రబెల్లి ఇద్దరూ కలిసి జనగామ జైలుకు వెళ్లారు. రిమాండ్‌లో ఉన్న జర్నలిస్టు ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన్ను పరామర్శించిన అనంతరం బయటకు వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నల వర్గం కురిపించారు. కావాలనే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు.