రోడ్డుపై పడుకొని నిరసన తెలిపిన పవన్‌.. ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు

-

టీడీపీ అధినేత చంద్రబాబును నిన్న సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన పవన్‌ కల్యాణ్‌ పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండకపోతే వర్మకు నిద్రపట్టదు. ఇక ఈ మధ్య పాలిటిక్స్ లో యమా యాక్టివ్ గా ఉంటున్న వర్మ .. జగన్ కు మద్దతు ఇస్తూ.. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఏకిపారేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే వ్యూహం అనే సినిమా తీస్తున్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. జగన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో జగన్ జైలుకు వెళ్లడం దగ్గరనుంచి ఆయన పాదయాత్ర.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలు.. అన్ని చుపించానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ లో కూడా జగన్ కోణంలోనే చూపించినట్లు తెలుస్తోంది.

ఇక గత రెండు రోజుల నుంచి చంద్ర బాబు అరెస్ట్ నేపథ్యంలో గత రాత్రి పవన్ కళ్యాణ్ ను విజయవాడ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఎలాగైనా విజయవాడ వెళ్లాలని పవన్ పట్టుబట్టి రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసిన విషయం కూడా తెలిసిందే. తాజాగా పవన్ అలా పడుకొని వ్యూహంలోని తన ఫోటోను కాపీ కొట్టాడని వర్మ ఆరోపించాడు. వ్యూహం ట్రైలర్ గమనిస్తే.. అందులో పవన్ పాత్రధారి నేలపై పడుకొని కాలుమీద కాలు వేసుకొని ఆలోచిస్తూ కనిపిస్తాడు. రాత్రి పవన్ సైతం నడిరోడ్డుపై పడుకొని కాలు మీద కాలువేసుకొని పోలీసులతో వాదిస్తూ కనిపించాడు. ఈ రెండు ఫోటోలను పక్కపక్కన పెట్టి.. “పైన నేను నెల క్రితం రిలీజ్ చేసిన “వ్యుహం” సినిమా ఫొటో.. కింద నిన్న రాత్రి రోడ్డు మీద తీసిన రియల్ ఫోటో” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version