ఎవరూ చట్టానికి అతీతులు కాదు.. అదే నిరూపితమైంది : విజయసాయిరెడ్డి

-

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పద్నాలుగేళ్ల పరిపాలనలో ఒక దృఢమైన అభిప్రాయానికి వచ్చాడని, ఎన్ని అన్యాయాలు చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా చట్టం నుంచి తప్పించుకోవచ్చని భావించాడన్నారు. ఏ కేసయినా స్టేలతో తెచ్చుకోవచ్చని చంద్రబాబు ఆలోచన అని, కుట్రలతో, కుతంత్రాలతో బయటపడటం చంద్రబాబు నైజమన్నారు విజయసాయిరెడ్డి. చట్టానికి లోబడి ఎవరైనా పనిచేయాల్సి ఉంటుందని, దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదని కోర్టు తీర్పు ద్వారా నిరూపితం అయ్యిందన్నారు. చంద్రబాబు మీద పెట్టిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో పక్కా దృఢమైన ఆధారాలతో పెట్టడం జరిగిందని, ఈ ఒక్క కేసే కాదు.. ఇంకా చంద్రబాబు మీద ప్రాసిక్యూట్ చేయాల్సినవి ఇంకా ఆరేడు కేసులు ఉన్నాయన్నారు విజయసాయిరెడ్డి.

అంతేకాకుండా.. ‘చట్టాన్ని తృణప్రాయంగా తన చేతిలో ఉన్న ఒక ఆయుధంగా మలుచుకుని తప్పించుకుంటూ వస్తున్నాడు.. ఇక మీదట అలా జరగదు.. జగన్ సీఎంగా ఉండగా గతంలో చంద్రబాబు ఎలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడో వెలికి తీయటం జరుగుతుంది.. ఏ రకంగా ఆంధ్ర రాష్ట్ర సొమ్మును దోచుకున్నాడో బయటకు తెస్తాం.. చంద్రబాబు అవినీతి సొమ్మును విదేశాలకు ఎలా తరలించారో బయట పడుతుంది.. జ్యుడీషియల్ రిమాండ్ తో పాటు పోలీస్ రిమాండ్ ఉంటుంది.. చంద్రబాబు అవినీతిపై సరిగ్గా విచారణ జరిగితే జీవిత కాలంలో బయటకు రాడు.. చంద్రబాబుతో పాటు రామోజీరావు కూడా చాలా దారుణాలు, అకృత్యాలకు పాల్పడ్డాడు.. రామోజీ సుప్రీం కోర్టు వరకు వెళ్లి తప్పించుకున్నారు.. గతంలో నేరాలకు పాల్పడ్డ వారందరినీ చట్ట పరిధిలోకి తీసుకువస్తాం.. తప్పు చేసిన ప్రతీ ఒక్కరికీ శిక్ష పడేలా చేయాల్సిన భాధ్యత ప్రభుత్వం పై ఉంది.. రాష్ట్రంలో ఉన్నత స్థాయి పదవులు చేపట్టిన వ్యక్తి అవినీతి గురించి కేసులు పెడితే రాజకీయ కక్ష్య సాధింపు అవుతుందా.. ప్రభుత్వం తన ధర్మం తాను నెరవేరుస్తుంది.. పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు రిమాండ్ కు పంపింది.. సరైన సాక్షాలు లేకుంటే రిమాండ్ దాకా రాదు.. ఒక్కసారి కేసు ఎఫ్ఐఆర్ నమోదయ్యాక కోర్టు పరిధిలోకి వెళ్తుంది.. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఎవరైనా వెళ్లాల్సిందే..’ అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version