‘కొండా’ వేడుకలో RGV స్పెషల్ అట్రాక్షన్..డైరెక్టర్ చిందేసిన వీడియో వైరల్

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)..వరంగల్ జిల్లా కు చెందిన కాంగ్రెస్ నేతలు..కొండా సురేఖ మురళీ ధర్ రావు దంపతులపై ‘కొండా’ అనే సినిమా తీశారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హన్మకొండలో జరిగింది. త్రిగుణ్, ఇర్రా మోర్ ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ గా నటించారు.

ఈ నెల 23న విడుదల కానున్న ఈ సినిమా ..డెఫినెట్ గా విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ పిక్చర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఫిల్మ్ లోని ఓ సాంగ్ కు వర్మ..లైవ్ లో డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

‘కొండా’ సినిమా కొండా మురళీ ధర్ రావు-సురేఖ దంపతుల బయోపిక్. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావాల్సిన టీపీసీసీ(తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్), మల్కాజ్ గిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కాగా, ఈ సినిమా ఫంక్షన్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే ప్రత్యేక ఆకర్షణగా నిలవడం గమనార్హం. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కొండా దంపతులు ఆకాంక్షించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version